టేకులపల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో మాజీ ఎంపీ జన్మదిన వేడుకలు

SB NEWS
By -
0

టేకులపల్లి SBNEWS: పాఠశాల అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే ప్రదేశం. కానీ టేకులపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంగణంలో చోటుచేసుకున్న ఓ కార్యక్రమం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాఠశాల ఆవరణలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేయడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.పాఠశాల ప్రాంగణంలో రాజకీయ నాయకుల చిత్రాలతో కూడిన భారీ బ్యానర్ ఏర్పాటు చేసి, పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో “ఇది విద్యాసంస్థా? లేక రాజకీయ పార్టీ కార్యాలయమా?” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

      విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయాల్సిన పాఠశాలల్లో రాజకీయ కార్యక్రమాలకు ఎంతవరకు అవకాశం ఉండాలి? విద్యాసంస్థల ప్రాంగణాలను రాజకీయ కార్యక్రమాలకు వినియోగించడం నిబంధనలకు అనుగుణమేనా? అనే అంశాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాఠశాలల్లో విద్యార్థులపై రాజకీయ ప్రభావం పడకుండా విద్యా వాతావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంది. అయితే ఒక మాజీ ఎంపీ జన్మదిన వేడుకలను పాఠశాల ప్రాంగణంలో నిర్వహించడం వెనుక పాఠశాల యాజమాన్యం అనుమతి ఉందా? కార్యక్రమానికి విద్యాశాఖ అధికారుల అనుమతి తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

     విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పాఠశాల ప్రాంగణంలో రాజకీయ వేడుకలు నిర్వహించడం ఎంతవరకు సమంజసం? దీనిపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default